Harish Rao : రాజీనామా చేస్తావా..?
సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్
- రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం బోనస్, ఆసరా పింఛన్ పెంపు, మహిళలకు రూ. 2500 సాయం, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట్లాడని కాంగ్రెస్‌ను ఓడించాలని హరీశ్‌రావు సూచించారు.
సంగారెడ్డి, ఏప్రిల్ 22 :
పదిహేను రోజుల్లో రూ. 39 వేల కోట్లు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఇంకా రైతుబంధు ఇవ్వలేదు.. కానీ ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తానని హరీష్ రావు చెప్పడంతో రేవంత్ పై హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలే మీకు చివరి అవకాశం. నేనెందుకు ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం బోనస్, ఆసరా పింఛన్ పెంపు, మహిళలకు రూ. 2500 సాయం, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట్లాడని కాంగ్రెస్‌ను ఓడించాలని హరీశ్‌రావు సూచించారు. రేవంత్ రెడ్డి అంటే మాటల్లో కోతలు అని హరీష్ రావు విమర్శించారు.


