వినాయక నవరాత్రులు భక్తి, సాంప్రదాయం, సమైక్యతకు ప్రతీకలు...
పీర్జాదిగూడ కార్పొరేషన్ లోని పలు వినాయక మండపాలను సందర్శించిన నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి
జయభేరి, మేడిపల్లి : వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పీర్జాదిగూడలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు సందర్శించారు.
అనంతరం, వివిధ కాలనీలలో నిర్వాహకులు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా భక్తులకు వడ్డించి, వారి మధ్య సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినాయక నవరాత్రులు భక్తి, సాంప్రదాయం, సమైక్యతకు ప్రతీకలని అన్నారు. ప్రజలంతా కలసి ఒకటిగా ఉండాలని, సమాజం అభివృద్ధి పథంలో నడవాలనేదే ఈ ఉత్సవాల ఉద్దేశమని చెప్పారు. పీర్జాదిగూడలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, స్థానికులకు అన్ని విధాలా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వినాయక మండపాల్లో ఉన్న స్వచ్ఛత, భక్తి శ్రద్ధలను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు వంగేటి ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్రు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ ఎన్ కే దుర్గ, 3 డివిజన్ ఇంచార్జ్ సుదర్శన్ రెడ్డి, 11వ డివిజన్ ఇంచార్జ్ రంజిత్ రెడ్డి, 12 వ డివిజన్ ఇంచార్జి నాదం గౌడ్, 26వ డివిజన్ ఇంచార్జ్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, అమర్నాథ్, జలగం శరత్ గౌడ్, అంజమ్మ,శారదా గౌడ్, నందిత గౌడ్, స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను మరింత వైభవంగా జరిపారు.
Post Comment