రేషన్ షాప్ లో నిలువు దోపిడీ... పక్కదారి పడుతున్న ప్రజా పథకం...
నిబంధనలకు నీళ్లు ఒదులుతున్న రేషన్ డీలర్లు.. పత్తా లేని సివిల్ సప్లై అధికారులు
శామీర్ పేట్, నవంబర్ 14 ( జయభేరి ) :- ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే ముసుగులో ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దోచేస్తున్నారు. రేషన్ దుకాణాల వద్ద రోజు ప్రజలకు పంపిణీ చేసే బియ్యం లో కొరత విధిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఒక కార్డు పై సుమారు 250 గ్రాములు కొరత విధిస్తున్నారు. పేద వారి కడుపు కొడుతూ సొమ్ము చేసుకుంటున్న అడిగే వారే లేక రేషన్ డీలర్లు రెచ్చిపోతున్నారు.
అలాగే ఈ నిర్వాహకులు 250 గ్రాముల బియ్యాన్ని కొరత విధిస్తూ అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పండి అంటూ భూకయిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లై అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని రేషన్ షాప్ డీలర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Latest News
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి
05 Dec 2024 08:36:11
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
Post Comment