ఇదేనా “సబ్ కా సాథ్ ”?
కాంగ్రెస్ రాష్ట్రానికి బ్లాక్‌లిస్ట్..!
ఇది పాలన కాదు ..ఇది పక్షపాత పాలన.
డా. రేఖా బోయలపల్లి, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు
జయభేరి, హైదరాబాద్ :
ఒకే రైల్వే మంత్రిత్వశాఖ.. రెండు తీర్పులు! ఇదేనా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీ నిశ్శబ్దం ఏమిటి?
పూణేకు పచ్చసిగ్నల్.. హైదరాబాద్‌కి ఎర్రసిగ్నల్... కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ బహిరంగంగా ద్వంద్వ నీతిని అమలు చేస్తోంది. ఇది పాలసీ కాదు . ఇది ప్రత్యక్షంగా రాజకీయ ప్రతీకారం!
పూణే మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు కోసం ₹3,626 కోట్లు కేంద్ర క్యాబినెట్ తక్షణమే ఆమోదించిన రాష్ట్రం బీజేపీ పాలిత మహారాష్ట్ర. తెలంగాణ ప్రభుత్వం ₹19,579 కోట్ల విలువైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-2B DPR కేంద్రానికి పంపింది. స్పందన? ఒక్క మాట కూడా లేదు. కారణం తెలంగాణ రాష్ట్రం? కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఇదేనా “సబ్ కా సాథ్ ”? లేదా “జిస్కా సీఎం కాంగ్రెస్, ఉస్కా ప్రాజెక్ట్ రిజెక్ట్ బీజేపీ రాష్ట్రానికి ఫాస్ట్ ట్రాక్ కాంగ్రెస్ రాష్ట్రానికి బ్లాక్‌లిస్ట్! ఇది పాలన కాదు ..ఇది పక్షపాత పాలన.

ఒక విషయం స్పష్టం:
హైదరాబాద్ మెట్రోపై చూపిన ఈ వంచన తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ సమాజం ప్రశ్నిస్తుంది. ఈ రాష్ట్రం తిరగబడుతుంది. అభివృద్ధికి అడ్డుపడే మీ దౌర్భాగ్యపు రాజకీయాలు నశించేలా చేస్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పై ఇంత కక్ష సాధింపా ? అభివృద్ధి అడిగితే శిక్షించడమేనా కేంద్ర ప్రభుత్వం లక్ష్యమా….


