TGPSC Group-1 2024: రేపటి నుంచి టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు.. మరి పరీక్షలు..!!

TGPSC Group-1 2024: రేపటి నుంచి టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు.. మరి పరీక్షలు..!!

TGPSC Group-1 2024: టీజీపీఎస్సీ గ్రూప్‌-1 విద్యార్థులు అలర్ట్‌.. రేపటి నుంచి తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్ పరీక్షల హాల్‌ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ ను కమిషన్‌ విడుదల చేసింది.

కాగా.. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులందరూ తమ వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా టీజీపీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.ఈ మేరకు అభ్యర్థులకు హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

Read More మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన లక్ష్మాపూర్ గ్రామస్తుడు

హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా కమిషన్‌ అధికారులను సంప్రదించాలని తెలిపారు. హైదరాబాద్ లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టబడింది. 7 పేపర్లకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

Read More  ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు

ఇది ఇలా ఉంటే మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ MBA, MCA కోర్సుల్లో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ అక్టోబర్ 15 మరియు 16 తేదీల్లో జరుగుతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మిగిలిన సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని, ప్రాధాన్యత ఆధారంగా అడ్మిషన్లు పొందవచ్చని కన్వీనర్ ఎ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.

Read More జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు

Latest News

నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి
మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల...
Reba Monica John
Rashmika Mandanna
Rashi Singh
గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...
స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు