అమరుల యాదిలో తెలంగాణ.. స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులందరికి ఘన నివాళులు
పీర్జాదిగూడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా దశాబ్ది వేడుకలు
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. కోట్లాది మందిని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా సాగింది. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అన్ని వర్గాలవారు పాల్గొన్నారన్నారు.
జయభేరి, మేడిపల్లి :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు బండారి రవీందర్ సూచనలతో పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నగర పరిధిలోని అమర వీరుల స్తూపం వద్ద స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాలి అర్పించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, మైనారిటీ అధ్యక్షులు జిలాని పాషా, యూత్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు జావీద్ ఖాన్, ఆంజనేయులు, బాలరాజు, వెంకన్న, యాసారం శ్రీనివాస్, కిరణ్, జగన్ రెడ్డి, శంకర్ రావు, నాయకులు జోగి రెడ్డి, మల్లం వెంకట్ గౌడ్, చిర్ర సంతోష్ రెడ్డి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Comment