పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి

తూంకుంటలోని విజ్ఞాన భారతి పాఠశాలలో ఎస్ ఎల్ సి ని ప్రారంభించిన మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి 

పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి

జయభేరి, నవంబర్ 23:
విద్యార్థులు నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా  అన్నింటిలో ముందుండాలని మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీలోని విజ్ఞాన భారతి హై స్కూల్ లో ఎస్ ఎల్ సి ని ఆయన  ప్రారంభించారు.  

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు  ప్రదర్శించిన  సంస్కృతి కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులు క్రమశిక్షణ పాటించేలా తల్లిదండ్రులు సైతం సహకరించాలన్నారు. అనంతరం  పాఠశాల కరస్పాండెంట్ గోనే హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ.... విద్యార్థులకు ఉన్నత బోధన బోధించేందుకు ఉపాధ్యాయులుగా మెరుగైన విద్యను అందించేందుకు  విజ్ఞాన భారతి పాఠశాల  ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. 

Read More Telangana I క్యాబినెట్ భేటీతో.. బీఅర్ స్ లో పెరిగిన దడ.!?

WhatsApp Image 2024-11-23 at 23.33.35(1)

Read More Telangana I రాజకీయాలు.. పోలీసులు...

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ట్రస్మా ప్రదాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఉపాద్యక్షుడు బి. అంజనేయులు, వినోద్, మండల కార్యదర్శి కే. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిపి, మండల కార్యదర్శి క్రిష్ణారెడ్డి, పాఠశాల ప్రిన్సిఫల్ బి. జంగారెడ్డి, వైస్ ప్రిన్సిఫల్ కే. వంశి గౌడ్, ప్రదానోపాధ్యాయురాలు గోనె సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More Telangana I చెత్త మనుషులు

Views: 0