శ్రీ విష్ణు శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు

ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన భక్తులు వాసు శిరీష దంపతులు

శ్రీ విష్ణు శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు

జయభేరి, నవంబర్ 23:
మేడ్చల్ జిల్లా ముడిచింతలపల్లి మండలం ఉద్ద మర్రిలోని శ్రీ విష్ణు శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన సబ్బినేని వాసు శిరీష దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఈ అన్నదానం కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాతలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.