తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది..
రేవంత్ అంచనా ఇదే?
హస్తం పార్టీ ఎంత మెజారిటీ సాధిస్తుంది అనే విషయంపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల మీడియా చర్చలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తప్పకుండా 13 స్థానాల వరకు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
జయభేరి, హైదరాబాద్ :
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన హడావిడి ముగిసింది. ఇక ఇటీవల పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రచారంతో హోరెత్తించి హామీల వర్షం కురిపించిన అభ్యర్థుల భవితవ్యం ఏంటి అన్న విషయాన్ని తెలంగాణ ఓటర్లు తేల్చేశారు. ఇక ఓటర్ల అభిప్రాయం అటు ఈవీఎంలలో ఎంతో భద్రంగా నిక్షిప్తమై ఉంది. జూన్ 4వ తేదీన అందరి జాతకాలు బయటపడుతున్నాయి. అయితే ఇక ఎన్నికల కౌంటింగ్ కి ఇంకా సమయం ఉండడంతో ఇక ఎవరికి వారు ఇక తమదే విజయం అనే విషయంపై బీమా వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో ఆరేడు స్థానాలలో ప్రతిపక్ష బిఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావు అంటూ వ్యాఖ్యానించారు. బిజెపి సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థికి 20వేల ఓట్ల మెజారిటీ రావడం ఖాయం అంటూ సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. అదే సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భీమ వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఇక తనను కాంగ్రెస్పార్టీ జాతీయ స్టార్ క్యాంపైనర్ గా నియమించిందని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడంపై ఇంక నిర్ణయం తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ పనిని అప్పగించిన చేస్తాను అంటూ తెలిపాడు.


