రేవంత్‌ ఖబడ్దార్‌.. మీ పార్టీ పతనం మొదలైంది...

ఆత్మసాక్షిగా చెప్తున్నం.. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తం డీఎస్సీ పరీక్ష వాయిదావేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంది?

రేవంత్‌ ఖబడ్దార్‌.. మీ పార్టీ పతనం మొదలైంది...

ఇక జన్మలో కాంగ్రెస్‌కు ఓటు వేయబోమని, ఇతరులెవ్వరినీ ఓటు వేయనివ్వబోమని అల్టిమేటం జారీచేశారు. ఈ మేరకు సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ డీఎస్సీ అభ్యర్థులు బుధవారం హైదరాబాద్‌లో బహిరంగ లేఖ విడుదల చేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయబోమని అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు. తమ కుటుంబసభ్యులు, బంధువులు కూడా కాంగ్రెస్‌కు ఓటెయ్యకుండా ప్రచారం చేస్తామని స్పష్టంచేశారు. 'తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులమైన మేము.. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయకుండా, ప్రిపేరయ్యేందుకు తగిన సమయం ఇవ్వకుండా, మా డిమాండ్లను నెరవేర్చకుండా, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయబోమని, కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని మా కుటుంబసభ్యులు, బంధువుల్లో ప్రచా రం చేస్తామని ప్రమాణం చేస్తున్నాం' అంటూ పేరొంటూ ప్రకటన విడుదల చేశారు. ఇతమిద్ధంగా పేర్లంటూ లేని ఆ లేఖ పూర్తి సారాంశం ఇలా..

Read More తెలంగాణ క్రీడా పాఠశాలలో 2k రన్ విజయవంతం చేయాలి

శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు నమసరించి తెలియజేయునది.. మేము డీఎస్‌ డీఎస్సీ స్టూడెంట్స్‌. గత నెల రోజులుగా డీఎస్సీ పోస్ట్‌పోన్‌ గురించి రోడ్లమీద ధర్నాలు చేయడం జరుగుతున్నది. మీరు ఇంతవరకు స్పందించడం లేదు. పైగా మా వెనుక బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారని చెప్తున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అందరూ కాంగ్రెస్‌ పార్టీలో చేరినంక ఎవరు మాకు సపోర్ట్‌గా ఉన్నది?. మీరు దాటవేయడానికి చెప్పే ముచ్చటని అర్థమవుతున్నది. పోస్టులు అమ్ముకున్నారు అంటున్నారు.

Read More చింతపల్లి మండల కేంద్రంలో ఏసీబీ దాడులు

అది ఎంతవరకు నిజమో మీకే తెలియాలి. పరీక్ష పోస్ట్‌పోన్‌ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమేమిటో మాకు అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాం. రెండు లక్షల తొంభై వేల మంది డీఎస్సీ రాస్తున్నారు. మీరు 11వేల పోస్టులు వేశారు. రెండు లక్షల తొంభై వేల మందిలో 11వేల మంది మాత్రమే జాబులు కొడతారు. మిగతా నిరుద్యోగులు మీ కాంగ్రెస్‌ పతనానికి కారకులవుతారు గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్‌ మీరు జరపాలని ఫిక్స్‌ అయ్యారని, పోస్ట్‌పోన్‌ చేయరని మాకు అర్థమవుతున్నది. నీకు, కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్‌ నాయకులారా.. సర్పంచ్‌ ఎలక్షన్లు ఉన్నాయి. ఎంపీటీసీ ఉంది.. జడ్పీటీసీ ఎన్నికలున్నాయి. ఏ కాంగ్రెస్‌ నాయకుడికీ ఓటు వేయం.

Read More పీఎం శ్రీ హోదా దక్కించుకున్న జవహర్ నవోదయ విద్యాలయం

అడుగడుగునా మీకు అడ్డుపడుతం. ఒకొక స్టూడెంట్‌ తలుచుకుంటే ఏమి జరుగుతుందో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి త్వరలోనే అర్థమవుతుంది. నిరుద్యోగులు రోడ్లమీద తిరుగుతుంటే సిగ్గు లేకుండా నవ్వుతూ ఫోన్లో ముచ్చట్లు చెప్తున్నారు. మీలాంటి నాయకులను ఎనుకున్నందుకు మమ్మల్నిమేము కొట్టుకోవాలి. ఇక నుంచి చూడండి. మా ఆత్మసాక్షిగా చెబుతున్నాం. జన్మలో కాంగ్రెస్‌కు ఓటు వేయం. మా తల్లిదండ్రులను, మా చుట్టాలను, అన్నదమ్ములను కలిసి ప్రతి ఒకరికీ చెప్తాం. కాంగ్రెస్‌కు ఓటేస్తే కలిగే నష్టాలపై ప్రచారం చేస్తాం. మామీద పోలీసులుచేసిన దాడిపై, మా అన్నదమ్ములు అకాచెల్లెళ్లంతా కలిసి రోడ్లమీద చేసిన ధర్నాలకు, ఆందోళనలకు మీరు స్పందించలేకపోయారు. ఖబడ్దార్‌ రేవంత్‌రెడ్డీ.. గుర్తుపెట్టుకో..! నీ పతనం మొదలైంది.

Read More మహిళలని గౌరవించే సంస్కృతి బీఅరెస్ పార్టి నాయకులకు లేదు...

మేము కాంగ్రెస్‌ వస్తే బాగుపడ్తం అనుకున్నం. చదువుకునే టైం ఇస్తలేరంటే రానురాను మా పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది.నువ్వు డబ్బులే పంచుకో ఏమన్నా చేసుకో..! ఎలక్షన్ల ఎవ్వరం నీకు ఓటు వెయ్యం. కాంగ్రెస్‌కు ఓటేయనియ్యం. మేము ఇంతవరకు ఏ పార్టీ శ్రేణుల దగ్గరికి పోలేదు. మద్దతు ఇవ్వాలని కూడా అడగలేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ న్యాయం చేస్తదని నమ్మినం. కానీ మీలాంటి మూర్ఖులను ఎన్నుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. డీఎస్సీ పోస్ట్‌పోన్‌ చేస్తేనే లెక. లేకపోతే నీ పతనం మొదలైంది చూసుకోండి.

Read More బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం

Latest News

దేవి శరన్నవరాత్రి ప్రత్యేక పూజలు దేవి శరన్నవరాత్రి ప్రత్యేక పూజలు
పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ గాయత్రి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి గురువారం నాడు...
ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు
గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి 
వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్  ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పలి
పెట్రోల్ ధరల పెంపు? తప్పదా?