పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

దేవరకొండ : పిఆర్టియు టీఎస్  సభ్యత్వ నమోదు ఒక వరం లాంటిదని, ప్రతి ఉపాధ్యాయులు సభ్యత్వం తీసుకోవాలని  పిఆర్టియు దేవరకొండ మండల అధ్యక్షులు కొర్ర లోక్యా నాయక్ అన్నారు. పి ఆర్ టి యు పి ఎస్ రాష్ట్ర పిలుపుమేరకు జిల్లా అనుమతి తో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సభ్యత్వ కార్యక్రమం  గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొదటగా పాఠశాల ప్రిన్సిపాల్ చేరుపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేసి మాట్లాడుతూ... సంఘం చేసిన కృషిని వివరిస్తూ సభ్యత్వం స్వీకరించాల్సిందిగా, ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పిఆర్టియు టీఎస్ సంఘం ఉపాధ్యాయుల,విద్యారంగ సమస్యల సాధనకై ముందుండి పాఠశాల ప్రతిష్టలను, అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.

Read More కేసీఆర్ గారు మిరెక్కడా...? 

ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు పెద్దన్న, నాగరాజు, శ్రీపతిరావు, వినోద్ కుమార్, కళ్యాణి, ఆర్ పి నాయక్, నాగవాణి, కళ్యాణ్, ప్రవీణ్ కుమార్, గిరి,శ్రీనయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More మేడిపల్లి బాపూజీ నగర నూతన అధ్యక్షుడిగా బాల్ద వెంకటేష్