Modi : నీతివంతమైన పాలనకు నిదర్శనం ప్రధాని మోదీ
గుండ్లపోచంపల్లి బీజేపీ ప్రచారంలో ఈటల సతీమణి జామున
- ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అనేక పథకాలను అమలు చేసిందని అలాంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలు బీజేపీ కి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఈటల జామున తెలిపారు.
జయభేరి, మేడ్చల్ :
ఒక్క అవినీతి మచ్చలేని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనను చూసి ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జామున అన్నారు. ఆదివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని ఈటల కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఈటల జామున మాట్లాడుతూ నరేంద్రమోదీ 10 సంవత్సరాల పాలనలో ఒక్క అవినీతి మచ్చలేకుండా పాలన సాగించిన గొప్ప నాయకుడు నరేంద్రమోదీ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అనేక పథకాలను అమలు చేసిందని అలాంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలు బీజేపీ కి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఈటల జామున తెలిపారు.
Views: 0


