గీతా పారిశ్రామిక సహకార సంఘం వారు ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు
జయభేరి, ఉప్పల్ :
గీతా పారిశ్రామికుల సమస్యలు -సర్వే నెంబర్ 278లో గతం లో 5 ఎకరాల భూమిని వారికి కేటాయించారు అందులొ ఈత చెట్లు పెంచుకున్నామని ,కాని ఈ భూమి మధ్యలో వాకింగ్ ట్రాక్ మరియు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించారని, వాటివలన అ చెట్లు మొత్తం పాడైపోయాయని, ఎమ్మేల్యే కి వారి మనవి ఏమనగా గీతా పారిశ్రామికులకు దానికీ బదులుగా వేరేచోట 5 ఎకరాల భూమిని కేటాయించాలని గీతా పారిశ్రామిక సహకార సంఘం వారు కొరారు. ఎమ్మేల్యే మాట్లడుతూ... సమస్యపై సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి మీ సమస్యను తప్పక చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో BRS పార్టీ నాయకులు నేమూరి మహేష్ గౌడ్, అధ్యక్షులు కాసుల అనంద్ గౌడ్, R రామ చంద్ర గౌడ్ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు రాగిరు నరసింహ గౌడ్, అనంద్ రాజ్ గౌడ్, అంజయ్య గౌడ్, నాథం గౌడ్, రాములు గౌడ్, ఆశోక్ గౌడ్,శశికాంత్ గౌడ్, శ్రవణ్ కుమార్ గౌడ్, చెన్నయ్య గౌడ్ తదితరులు పాల్గోన్నారు.
Post Comment