ప్రత్యామ్నాయ పార్టీలు లేదా నాయకులను ఎన్నుకుంటే వారు సమస్యలపై ప్రభుత్వాన్ని
నిష్పక్షపాతంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది
మూడు ప్రధాన పార్టీలతో పాటు 11 రిజిస్టర్డ్ పార్టీలు, 38 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా, విద్యావంతులైన పట్టభద్రులచే శాసన మండలికి ఎన్నుకోబడే ఈ ఎన్నికల్లో విద్యావంతులు, పట్టభద్రుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవాలి.
జయభేరి, హైదరాబాద్ :
27 మే 2024న జరుగనున్న, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
అసలు సమస్యలు ఉన్నాయని గుర్తించినపుడే వాటి పరిష్కారానికి మార్గాలు ఆలోచించే అవకాశం ఉంటుంది. కావున ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి, రాజ్యాంగం, చట్టాలు, పాలన విషయాల పట్ల పూర్తి అవగాహన ఉండి, చట్టపరమైన పరిష్కార మార్గాలు చూపగల విద్యావంతులైన అభ్యర్థులను ఎన్నుకోవాలి. తద్వారా వారి సమస్యలు పరిష్కారమౌతాయి. పట్టభద్ర ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలి.

Views: 0


