ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన డి సి హెచ్ మాతృ నాయక్
దేవరకొండ.... ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలని, వైద్య సేవల కొరకు నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వ దవాఖానాలో ప్రసవాలా సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ డి సి హెచ్ మాతృ నాయక్ తెలిపారు. బుధవారం దేవరకొండ ఏరియ ఆసుపత్రికి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని అన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీధితోపాటు ఇంచార్జ్ సూపరిడెంట్ మంగ్త నాయక్, డాక్టర్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?
Views: 0


