ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులు

మాకు ఫ్రీ బస్ వద్దు.. మహిళల ఆవేదన

  • ట్రాఫిక్ తో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు వాహనాదారులు
  • కాంగ్రెస్ సమావేశాలకు కార్యకర్తలు కరువు
  • డబ్బులు ఇచ్చి మహిళలను పోగు చేసిన నాయకులు 

ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులు

జయభేరి, మే 5:
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో డబ్బుల పంపిణీ  దర్జాగా జరిగింది. ఆదివారం మూడు చింతలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి  సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మూడు చింతలపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలోకి మహిళలను, ప్రజలను పంపించారు.  ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ డబ్బులు పంపిణీ చేశారు. అధికారంలో ఉన్నామన్న ధైర్యంతో డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని సాక్షాత్తు మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఎంచుకున్నారు. ఇట్టి సంఘటనపై  ఎన్నికల అధికారిగా విధులు నిర్వహిస్తున్న  మండల తాసిల్దార్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.. 

kish2

Read More మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు అరెస్టు 

మాకు మీ ఫ్రీ బుస్స్ వద్దు.. మహిళల ఆవేదన
పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. కార్నర్ మీటింగ్ లో సునీత మహేందర్ రెడ్డి ప్రసంగిస్తుండగా అక్కడి స్థానిక మహిళలు కొందరు గందరగోళం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీబస్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . ఫ్రీ బస్ వల్ల నష్టాలు తప్ప లాభం ఏమీ లేదని ఫ్రీ బస్సు వల్ల మహిళలు ఎక్కడైనా బస్సు ఆపితే ఆపడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ సౌకర్యం కేవలం వృద్ధులకు విద్యార్థులకు మాత్రమే వర్తించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వ్యవసాయ పంటలకు సరియైన విద్యుత్ అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని వారు ఆరోపించారు.

Read More దేవి శరన్నవరాత్రి ప్రత్యేక పూజలు

kish3

Read More దుద్దెనపల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ట్రాఫిక్ తో ఇబ్బంది పడ్డ ప్రజలు
ఆదివారం మూడు చింతలపల్లి మండల కేంద్రంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి కారణం మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. దీనివల్ల మండల కూడలి వద్ద దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది . ఎండాకాలం కావడంతో బస్సులో కారులో ఉన్న ప్రజలు ట్రాఫిక్ జామ్ తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ముఖ్యంగా ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు మండల కేంద్రానికి నిత్యవసర సరుకులకు వస్తుంటారు దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించడంతో ఇంకా భారీగా ప్రజలు రావడంతో ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది.

Read More మద్యం విధానంపై మరో కీలక అప్‌డేట్