Congress : దేశములో కాంగ్రెస్ రాబోతుంది.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి

  • మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు
  • హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ అగరబత్తిపై కూడా జీఎస్టీ వేసింది
  • రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క.
  • గ్యారెంటీలకే గ్యారెంటీ మన రాహుల్ గాంధీ
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం లేదనే బీఆర్ఎస్‌ను ప్రజలు పక్కన పెట్టారు
  • మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్
  • భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు
  • జీఎస్టీ తీసుకువచ్చి 54 లక్షల కోట్లను పేదల నుంచి తీసుకున్నారు
  • మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలి 
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క...

Congress : దేశములో కాంగ్రెస్ రాబోతుంది.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి

ఏటూరు నాగారం మండల కేంద్రములో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, కాన్నాయి గూడెం మండలాల మహాబుబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిలుగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు,రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క..

ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో ఇందిరమ్మ రాజ్యం రావాలికాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. జీఎస్టీ తీసుకువచ్చి రూ.54 లక్షల కోట్లను పేదల నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు పదేళ్లలో ఒక్కటి కూడానెరవేరలేదన్నారు. జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు వేశారా ఒక్క సారి ప్రజలు ఆలోచన చెయ్యాలి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చెయ్యడమే మన లక్ష్యమని కాంగ్రెస్ నేతలకు సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేశామన్నారు.

Read More మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

IMG-20240507-WA4369

Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు

బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు 10 లక్షల జీవిత భీమా ఇస్తామన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారితో పాటు ఇండియా కూటమి నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం