సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి - ప్రత్యేకాధికారి సైదులు

మజీద్ పూర్ గ్రామంలో స్వచ్చదనం - పచ్చదనం

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి - ప్రత్యేకాధికారి సైదులు

జయభేరి, ఆగస్టు 9:- మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం మజీద్ పూర్ గ్రామంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సైదులు, ఎంపివో, పంచాయితీ కార్యదర్శి వేణు గోపాల్ పాల్గొన్నారు.

అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు. అదేవిదంగా విద్యార్ధులకు పరిశుభ్రత పై పలు సలహాలు సూచనలు అందచేశారు. ఇక ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు పారిశుధ్య సిబ్బందితో నీరు నిలువ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయించారు.

Read More ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేడిపల్లి పోలీసులు