Animals, birds - Water : జంతువులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్లు

సవిలో తాగునీటి ఎద్దడి కి అన్ని చర్యలు తీసుకోవాలి.. తుంకుంట మున్సిపల్ కార్యాలయం లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కమిషనర్ వెంకట గోపాల్ 

Animals, birds - Water : జంతువులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్లు

తాగునీటి సరఫరా కొరకు పురపాలక సంఘం కార్యాలయంలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ సెల్ నంబర్ 9912140798 ఏర్పాటు చేసినట్లు, తాగునీటి సరఫరా విషయం లో సమస్యలు ఎదురైతే ఈ నంబర్ కు పిర్యాదు చేయవచ్చునని సూచించారు. అంతేకాక నీటి సరఫరా లో అంతరాయం కలిగితే ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.

జయభేరి, ఏప్రిల్ 8 :
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తుంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పురపాలక సంఘం కార్యాలయంలో వాటర్ వర్క్స్ అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటి సరఫరా కొరకు పురపాలక సంఘం కార్యాలయంలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ సెల్ నంబర్ 9912140798 ఏర్పాటు చేసినట్లు, తాగునీటి సరఫరా విషయం లో సమస్యలు ఎదురైతే ఈ నంబర్ కు పిర్యాదు చేయవచ్చునని సూచించారు.

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

0d07f56c-e68a-48e1-9f81-5f36c243a7c6

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

అంతేకాక నీటి సరఫరా లో అంతరాయం కలిగితే ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఇక జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చాలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జంతువులు, పక్షుల దాహార్తిని తీరిచేందుకు నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా ప్రజలు సైతం తమ ఇంటి మిద్దెల పైన పక్షుల కోసం నీటి తొట్ల ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా నీటి సరఫరా విభాగంలో పురపాలక సంఘం కార్యాలయం నుండి డిప్యూటీ EE G. సునీత ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రవణ్ కుమార్, భాస్కర్, RO శ్రీనివాస్, HMWS &SB అధికారులు, బిల్ కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

Read More SBI | రమేష్ మృతి తీరని లోటు   

Views: 0