నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విచారణ జరపాలి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్

నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విచారణ జరపాలి


జయభేరి, హైదరాబాద్ :

దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, మే 5న పరీక్షను నిర్వహించడం జరిగింది.

Read More మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం 

దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షను రాశారు. ప్రకటించిన ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు, విద్యార్ధి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వారి అనుమానాలకు సజీవ సాక్ష్యం ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం మరల వారి యొక్క పరీక్ష కేంద్రం ఒకటే కావడం వలన వారి అనుమానాలకు బలాన్నిస్తుంది. కావున తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి పరీక్ష రాసిన మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

Read More చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

అదేవిధంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షను రద్దు చేయాలనీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన కూడా వారి మాటని పెడచెవిన పెట్టి, నిర్లక్ష్యం చేయడం ద్వారా వేలాది మంది ప్రతిభగల  విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారు.   ప్రస్తుత విద్యాసంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై, పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచేతవిచారణ జరిపించాలని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేయడం జరిగింది.

Read More కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మేడ్చల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్