ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం
అడ్డుకున్న అధికారులు
1994లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. వీరు తమ ఇళ్ళకు వెళ్ళడానికి సొంత ఖర్చులతో అప్పుడే మట్టి రోడ్డు వేసుకున్నారు.
సికింద్రాబాద్:
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా ఉంది అడ్డగుట్ట బోయబస్తి నాయక్ బస్తీ ప్రజల పరిస్తితి. ఇక్కడి ప్రాంత ప్రజలు గత యాబై ఏళ్ల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరికి 1994లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. వీరు తమ ఇళ్ళకు వెళ్ళడానికి సొంత ఖర్చులతో అప్పుడే మట్టి రోడ్డు వేసుకున్నారు.
ఇదే విషయాన్ని మూడేళ్లుగా ప్రభుత్వంలోని అన్ని స్థాయిల అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా పిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. సోమవారం రోజున తెగించి పామును నీటి డబ్బాలో బంధించి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కార్యాలయానికి తీసుకువెళ్లడం జరిగిందని వివరించారు. బాటిల్ లో పామును చూసిన ఎమ్మెల్యే వెంటనే అధికారులకు పోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మంగళవారం ఇక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్తా చెదారాన్ని తొలగిస్తుండగా సదరు నేత అక్కడికి చేరుకొని పనిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అప్పుడే అక్కడికి మీడియా సైతం చేరుకోవడంతో మెల్లిగా అతను అక్కడి నుండి జారుకున్నాడు.
ఆ స్థానిక నేత గతంలో బీఆర్ఎస్ ఇటీవల మరో పార్టీలోకి వెళ్ళాడని బస్తీ ప్రజలు తెలిపారు. ఐతే ఇతను ఈ స్థలం తనదని బెదిరింపులకు పాల్పడడమే కాకుండా రౌడీలను కూడా తీసుకు వచ్చాడని వారు తమ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు వేయడంతో పాటు ఈ స్థలాన్ని అక్రమించడానికి ప్రయత్నం చేస్తున్న బల్దేవ్ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విష సర్పలతో పాటు, నేత నుండి కూడా రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.


