అమ్మా బైలెళ్లినాదో.. తల్లీ బైలెల్లినాదో
- గుండ్లపోచంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలు
- అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మహిళల బోనాల సమర్పణ..
మేడ్చల్..
తెలంగాణ ప్రజలు తమ సంస్కృతిని ప్రతిభింబిస్తూ జరుపుకునే పండుగల్లో బోనాల పండుగకు ప్రత్యేక విశిష్టత ఉందని గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో జరిగిన ఆషాడ మసా బోనాల వేడుకలో శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Read More మేడ్చల్ లో కీచక పోలీస్
అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ
మున్సిపాలిటీ పరిదిలోని ఎస్సి కాలనీలో ఆదివారం జరిగిన బోనాల పండుగ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. కాలనీలోని మహిళలంతా ఒక్కటై బోనాలను ఎత్తుకొని పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో డప్పువాయిద్యాల మధ్య ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవార్లకు బోనాలు నైవేద్యాలను సమర్పించి పూజలు చేశారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment