ఏసీబీ వలలో కమలాపూర్ తహసీల్దార్ మాధవి

ఈ నేపధ్యంలో కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు  సోమవారం నాడు కొనసాగాయి. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం కు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర  విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం 30000 డిమాండ్ చేసినట్లు ఆరోపణ.

ఏసీబీ వలలో కమలాపూర్ తహసీల్దార్ మాధవి

జయభేరి, హన్మకొండ :
హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి ఏసీబీ వలలో చిక్కారు.. ఒక రైతు వద్ద లంచం తీసుకుంటూ మాధవి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ నేపధ్యంలో కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు  సోమవారం నాడు కొనసాగాయి. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం కు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర  విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం 30000 డిమాండ్ చేసినట్లు ఆరోపణ. ముందుగా 5,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు సమాచారం . ఎసిబీ అధికారులు పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.