అక్రమంగా డంపు చేసిన 32 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యన్ని స్వాధీనం 

దేవరకొండ డిటిసిఎస్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్

అక్రమంగా డంపు చేసిన 32 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యన్ని స్వాధీనం 

జయభేరి, దేవరకొండ :
 పట్టణ జంగాల కాలనీలోని ఖాళీ స్థలంలో అక్రమంగా డంపు చేసిన 32 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యన్ని దేవరకొండ డిటిసిఎస్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్ పట్టుకున్నారు. జంగాల కాలనీలోని బొంతలు కొట్టేవాళ్ళు గ్రామ గ్రామ తిరిగి బొంతలు కొడితే కొందరు బియ్యం ఇచ్చారని అధికారులతో వారు తెలిపారు. ఈ సందర్భంగా డిటిసిఎస్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఏది ఏమైనా ఈ బియ్యన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో డబ్బులు వెచ్చించి నిరుపేదలకు ఇస్తుందని, కాబట్టి ఇలా డంపు చేసి పెట్టడం చట్ట విరుద్ధమని, బొంతలు కొట్టినచో మీరు డబ్బులు మాత్రమే తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో బియ్యం తీసుకోకూడదని కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్టి 32 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసి సేఫ్ కస్టడీ కొరకు గోదాంలో భద్రపరచడం జరిగిందని అన్నారు.

Views: 0