జూన్ 14న శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్పయాగం

జూన్ 14న ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు.

జూన్ 14న శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్పయాగం

జయభేరి, తిరుపతి :
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 14వ తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూన్ 13వ తేదీ సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా జూన్ 14న ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు.

Read More Rashi Palalu : నేటి రాశి ఫలాలు

మధ్యాహ్నం 1 నుండి 4 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.

Read More శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం మూడు నెలలు మూసివేత..

Views: 0

Related Posts