హ‌నుమంత‌ వాహనంపై శ్రీ కోదండ‌రామ‌స్వామి అలంకారంలో వేణుగోపాలుడి అభ‌యం

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆర‌వ రోజైన‌ సోమ‌వారం ఉదయం 7.30 గంటలకు శ్రీ కోదండ‌రామ‌స్వామి అలంకారంలో హ‌నుమంత‌ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు అభ‌య‌మిచ్చారు.

హ‌నుమంత‌ వాహనంపై శ్రీ కోదండ‌రామ‌స్వామి అలంకారంలో వేణుగోపాలుడి అభ‌యం

జయభేరి, తిరుపతి :
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆర‌వ రోజైన‌ సోమ‌వారం ఉదయం 7.30 గంటలకు శ్రీ కోదండ‌రామ‌స్వామి అలంకారంలో హ‌నుమంత‌ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు అభ‌య‌మిచ్చారు.

మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఆలయ ఏఈఓ  పార్థసారథి, సూపరింటెండెంట్‌  సోమ శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read More Ugadi 2024 : తెలుగు సంవత్సరాలకు వాటి పేర్లు ఎలా వచ్చాయి?

Views: 0

Related Posts