పేకాట స్థావరంపై పోలీసుల దాడి...

నలుగురిని అదుపులోకి  తీసుకున్న టాస్క్ ఫోర్స్, గౌరారం పోలీసులు

పేకాట స్థావరంపై పోలీసుల దాడి...

జయభేరి గజ్వెల్ నవంబర్ 23...
నమ్మదగిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గౌరారం పోలీసులు దాడి చేశారు. వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలోని ఓ ఇంటిలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై శనివారం సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గౌరారం పోలీసులు వెళ్లి రైడ్ చేసి, నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. 

వారి వద్ద నుండి రూ.36,860 నగదు, నాలుగు మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో  ఫామ్హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో  జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446,  8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

Read More ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్