అలియాబాద్ గ్రామంలో ఘటన

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అలియాబాద్ గ్రామంలో ఘటన

జయభేరి, ఆగస్టు 7: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అలియాబాద్ గ్రామానికి చెందిన మహేష్ (38) అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  

అయితే ఈ మధ్య కాలంలో మహేష్ భార్య మృతి చెందింది. కాగా ఈ విషయంలో మృతుడి పై కేసు నమోదు అయింది. పోలీసులు మహేష్ ను కోర్టులో హాజరు కావాలని తెలపడంతో మనస్తాపానికి గురైన మహేష్ మోట బావి వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనాథ్ తెలిపారు.

Read More అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య