Chief Ministers : ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణ ఏర్పాటు పండుగ వాతావరణంలో నిర్వహించండి
కలెక్టర్ ప్రవీణ్ కుమార్
ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజక వర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో సదరు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడ సభకు మొబిలైజ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
జయభేరి, తిరుపతి :
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల జూన్12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని ప్రతి నియోజక వర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజక వర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో సదరు ప్రమాణ స్వీకార మహోత్సవ విజయవాడ సభకు మోబిలైజ్ చేయాలని, ప్రత్యక్ష ప్రసార వీక్షణకు పండుగ వాతావరణంలో ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజక వర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో సదరు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడ సభకు మొబిలైజ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకొరకు మండల కార్యస్థాన తహశీల్దార్, ఎంపిడిఓలు బాధ్యతగా సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పంపాల్సి ఉంటుంది అని తెలిపారు.
ప్రతి బస్ కు ఒక నోడల్ అధికారి ఏర్పాటుతో బాధ్యతగా వారిని రేపు మంగళవారం ఉదయం తీసుకుని బయల్దేరి సాయంత్రం 5 గం.లకు సూచించిన ట్రాన్సిట్ పాయింట్ వద్ద వెళ్ళాలని రాత్రి బస ఏర్పాటు ఉంటుందని, అనంతరం మరుసటి దినం ఉదయం బుధవారం జూన్12న ఆం.ప్ర సిఎం ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి వారిని తీసుకు వెళ్లి అనంతరం జాగ్రత్తగా వారిని తిరిగి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. త్రాగునీరు తదితర ఏర్పాట్లు సదరు నోడల్ అధికారి బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. బస్సుకు ఫ్లెక్సీ ఏర్పాటు ఉండాలని తెలిపారు.
Post Comment