పద్మవిభూషణ్ చిరంజీవికి అభినందల వెల్లువ..!

చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించడం పట్ల ద్రౌపదీ ముర్ము స్పందించారు. "తన సినిమాల ద్వారా, మానవతా సేవల ద్వారా ప్రజల జీవితాలను స్పృశించిన ప్రముఖ నటుడు. చిరంజీవి పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు.

పద్మవిభూషణ్ చిరంజీవికి అభినందల వెల్లువ..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. కళారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. దీన్ని ఇవాళ ఆయన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ముర్ము నుంచి అందుకున్నారు. దీంతో చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించడం పట్ల ద్రౌపదీ ముర్ము స్పందించారు. "తన సినిమాల ద్వారా, మానవతా సేవల ద్వారా ప్రజల జీవితాలను స్పృశించిన ప్రముఖ నటుడు. చిరంజీవి పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అతను మార్గదర్శక ప్రయత్నాలను కూడా చేసాడు. అనేక సామాజిక కారణాల కోసం విస్తృతంగా పనిచేశాడు." అని తెలిపారు.

Read More Highest Grossing movies in 2024 : ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు..

చిరు పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్‌ @KChiruTweets కి శుభాకాంక్షలు. లక్ష్యాల పట్ల గట్టి సంకల్పంతో, క్రమశిక్షణతో కృషిచేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన చిరంజీవి గారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి." అని తెలిపారు.

Read More Gangs of Godavari : అయేషా ఖాన్ అందాలతో మోత మోగించేసింది...

మెగాస్టార్ కు పద్మవిభూషణ్ లభించడం పట్ల టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా అభినందనలు తెలిపారు. "మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది తెలుగువారు గర్వించే సందర్భం. నాతో సహా కోట్లాది అభిమానులు ఆనందించే సమయం." అని తెలిపారు.

Read More Sruthi hasan I శృతి హాసన్తో లోకేష్ రొమాన్స్ పీక్స్..

Views: 0

Related Posts