దాదాపు 20 ఏళ్లు గడిచిపోయాయి.
జయభేరి, హైదరాబాద్: ఆ కుర్రాడు అప్పుడే హీరోగా తెలుగులో పరిచయమవుతున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్‌కూ దర్శకుడిగా అదే తొలి సినిమా. ఆ మూవీ ప్రారంభం సందర్భంగా దేశంలోని అగ్ర కథానాయకుల్లో ఒకరైన చిరంజీవి వచ్చి తన అభినందనలు తెలిపారు. హీరో-హీరోయిన్లతో కలిసి ఫొటో కూడా దిగారు.
అజిత్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరోవైపు చిరంజీవి కథానాయకుడిగా ‘విశ్వంభర’ రూపొందుతోంది. సోషియో ఫాంటసీ కథతో రానున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతోంది.
ఈ క్రమంలో 'విశ్వంభర' సెట్స్‌కు అజిత్ వెళ్లారు. అజిత్‌ను సాదరంగా ఆహ్వానించిన చిరు ఆయనతో కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ఇద్దరూ తమ సినిమాల గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలో చిరునవ్వులు చిందిస్తూ చిరంజీవి, అజిత్ దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 20 ఏళ్ల కిందట 'ప్రేమ పుస్తకం' కోసం దిగిన ఫొటోను జత చేస్తూ అభిమానులు సోషల్‌మీడియాలో పంచుకున్నారు.
Post Comment