యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ఫిషర్మెన్ కమిటీ రాష్ట్ర నాయకుడు బుడ్డా నరసింహ ముదిరాజ్

భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రికెట్ సామాగ్రి టీ షర్ట్స్ బహుకరణ

యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

జయభేరి :

యువత చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో ప్రతిభావంతులుగా ఎదగాలని ఫిషర్మెన్ కమిటీ రాష్ట్ర నాయకుడు ఎలికట్ట గ్రామ మాజీ వార్డు సభ్యుడు కాంగ్రెస్ యువ నేత బుడ్డా నరసింహ ముదిరాజ్ అన్నారు. ఆదివారం మాల్ ఎలికట్ట గ్రామ యువకులకు భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ సామాగ్రి తో పాటు టీ షర్ట్స్ ని గ్రామ యువ క్రీడాకారులకు యూత్ సభ్యులు అందజేశారు.

Read More 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

ఈ సందర్భంగా బుడ్డా నరసింహ ముదిరాజ్ మాట్లాడుతూ క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో సాగాలని క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు మెలగాలని గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో తమ తమ ప్రతిభను కనబరిచి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు చదువుల్లోనూ క్రీడల్లోనూ రాణించి గ్రామానికి కన్నవారికి మంచి పేరును సంపాదించి పెట్టాలని సూచించారు ఎందరో క్రీడాకారులు నేడు దేశానికి ఆడుతున్నారంటే వారు ఎంతో క్రమశిక్షణతో పట్టుదలతో శ్రమించి తమ ప్రతిభకు సానబెట్టారని ప్రతి క్రీడాకారుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే పట్టుదలతో ముందుకు సాగాలని కోరారు.

Read More ఘనంగా డాక్టర్ వేణుధ రెడ్డి జన్మదిన వేడుకలు

భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలకు భగత్ సింగ్ యూత్ అండగా ఉంటుందని విద్య, క్రీడా, వైద్య రంగాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలే లక్ష్యంగా భగత్ సింగ్ యూత్ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి యూసుఫ్, శ్యాంకుమార్, గడ్డమీద శీను, బుడ్డొల్ల సురేష్, కావలి నరేష్, కిరణ్, కావలి రాజేష్, రాము,డిల్లి శివ,శ్రీకాంత్, పిట్టల జంగయ్య, వెంకటేష్, అంజి, ప్రసాద్, నరేష్, మణికంఠ, గిరి, రాజేష్, శ్రీధర్, భగత్ సింగ్ యూత్ సభ్యులు యువ క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.