Kalyanam: వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్.. స్వామివారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆలయ కమిటీ పేర్కొంది.
జయభేరి, జయభేరి, మే 18 :
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని శ్రీ బాలాజి వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా బజంత్రీలతో, భక్తుల నామస్మరణతో అలివేలు పద్మావతి సమేతా శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండవగా అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు.

అనంతరం మాజి జడ్పిటిసి, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆలయ కమిటీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మేడ్చల్ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, జడ్పిటిసి హరివర్దన్ రెడ్డి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింహాయాదవ్, మాజి చైర్మన్ మైసయ్య, ఎంపిటిసి హన్మంతరెడ్డి, వైస్ ఎంపిపి మంద శ్రీనివాస్ రెడ్డి, నాయకులు వంగ లక్ష్మారెడ్డి, వెంకటరమణరెడ్డి, గొనె మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, తహాశీల్దార్ వెంకటనర్సింహారెడ్డి, ఆర్ఐ నరేష్, కృపాకర్ రెడ్డి, భూమేష్ గౌడ్, రాములుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Post Comment