TS Inter : ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మెరిసిన ఆణిముత్యాలు
- అత్యుత్తమ ఫలితాలు సాధించిన బాలికలు 1000 మార్కులకు గాను ఎంపీసీ నుంచి ఎ. మేఘన 944, బైపిసి నుంచి ఉమ్రా తబస్సు 881, సీఈసీ నుంచి మానస837, హెచ్. ఈ సి నుంచి శ్రావణి 941, ఆఫీస్ అసిస్టెంట్ కోర్సు గొడుగు శివాని 927, కంప్యూటర్సైన్స్ లో పి పూజిత 975
జయభేరి, దేవరకొండ :
దేవరకొండ పట్టణంలోని మందడి రత్నమ్మ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు. బాలికలు భళా అనిపించుకున్నారు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 68 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన బాలికలు 1000 మార్కులకు గాను ఎంపీసీ నుంచి ఎ. మేఘన 944, బైపిసి నుంచి ఉమ్రా తబస్సు 881, సీఈసీ నుంచి మానస837, హెచ్. ఈ సి నుంచి శ్రావణి 941, ఆఫీస్ అసిస్టెంట్ కోర్సు గొడుగు శివాని 927, కంప్యూటర్సైన్స్ లో పి పూజిత 975 మార్కులు సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు.

అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా ఎంపీసీ నుంచి అక్షర461/470, బైపీసీ నుంచి పరిహ నిడ416/440, సీ ఈసీ నుంచి 390/500, హెచ్ ఈ సి నుంచిఅంజమ్మ 444/500, ఆఫీస్ అసిస్టెంట్ లో కే శైలజ463/500, కంప్యూటర్ సైన్స్ లో అమతుల్ జూరియన్ 480/500 మార్కులు సాధించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ బాలికలు కళాశాలలో అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం సేవలు వినియోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల ప్రిన్సిపాల్ సునీత మరియు కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, సమయపాలనతో, నిరంతర కృషితో చదువులో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక మంది విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కొరకు దరఖాస్తు చేసుకోవలసిందిగా తెలియజేశారు.
Post Comment