TS Election : రాముడి ఫోటోతో ఓట్లు అడుగుతున్నారు
- కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి గా మే 13న జరిగే ఎన్నికల్లో వెలిచల రాజేందర్ ని గెలిపించండి. మీ ఆశీర్వాదం తో హుస్నాబాద్ ఎమ్మెల్యే అయ్యాను. మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉన్న.. నేను పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే చిగురు మామిడి మండలంలో నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది.
జయభేరి, హుస్నాబాద్ :
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తదితరులు పాల్గోన్నారు. తరువాత మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి గా మే 13న జరిగే ఎన్నికల్లో వెలిచల రాజేందర్ ని గెలిపించండి. మీ ఆశీర్వాదం తో హుస్నాబాద్ ఎమ్మెల్యే అయ్యాను. మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉన్న.. నేను పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే చిగురు మామిడి మండలంలో నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ మండలం అలాంటి మెజారిటీ అందించాలి.. కాంగ్రెస్ వచ్చిన తరువాత ఏం చేసిందన్న దానిపై ధైర్యంగా బిఆర్ఎస్, బీజేపీ నేతలు వస్తె చెప్పండి. 2004-14 మధ్య మా ప్రభుత్వం అన్నీ హామీలు అమలు చెశాం. మళ్ళీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసి లో ఉచిత ప్రయాణం అందిస్తున్నాం. 500 కి గ్యాస్ అందిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ 10 లక్షలు చేశాం. కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఛాలెంజ్ చేసే వాళ్ళు రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉండండి.
నరేంద్ర మోడీ ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి. నల్ల చట్టాలు తెచ్చి రైతులను చంపితిరి .మీ ఎమ్మెల్యేను కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి మరింత బలవంతుడికి చేయండి. మామ కొండూరు మెజారిటీ వస్తదా.. హుస్నాబాద్ మెజారిటీ వస్తదా... సవాలు చేస్తున్నా. నాకు హుస్నాబాద్ లో మెజారిటీ ఇచ్చి నా గౌరవాన్ని కాపాడండి. మీరు ఎక్కడికి వెళ్లిన హుస్నాబాద్ అంటే మీ గౌరవం పెంచేలా చేస్తా అని చెప్పా. ప్రతి ఇంటా వెళ్లి చెప్పండి.. కాంగ్రెస్ కి ఓటేయంది. మీకు చెప్పిన పనులు చేశా నాకు 4 వేల పైన ఇచ్చిన ఈ మండలంలో ఇంకా మెజారిటీ తేవాలని కోరుతున్న రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, 4000 పెన్షన్ లాంటివి భవిష్యత్ లో అన్ని చేస్తామని అన్నారు.
Post Comment