ఎమ్మెల్సీ చుట్టూ బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!
భుజంగరావు, తిరుపతన్న విచారణలో వెల్లడించారు నేడు, రేపు ఎమ్మెల్సీకి నోటీసులు
ఫోన్ ట్యాపింగ్‌కు అవసరమైన పరికరం దిగుమతికి MLC నిధులు సమకూర్చారు! భుజంగరావు, తిరుపతన్న విచారణలో వెల్లడించారు
నేడు, రేపు ఎమ్మెల్సీకి నోటీసులు
ఫోన్ ట్యాపింగ్‌కు అవసరమైన ఎలక్ట్రానిక్ డివైజ్‌ను దిగుమతి చేసుకునేందుకు నిధులు సమకూర్చినట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయనను విచారిస్తే మరికొందరు రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్‌డీ) రాధాకిషన్‌రావు మూడోరోజు పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. మరో నాలుగు రోజుల కస్టడీ మిగిలి ఉంది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Views: 0


