అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

జయభేరి, అక్టోబర్ 13:- అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా తుంకుంట లో చోటు చేసుకుంది. తుంకుంట కు చెందిన కతిమిల్ల శివకుమార్ అనే వ్యక్తి మహేంద్ర లాజిస్టిక్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు.

దసరా పండగ సందర్భంగా పరిశ్రమలో నిర్వహించిన దుర్గమాత పూజలో పాల్గొని ఇంటికి వెళ్ళాడు. తిరిగి రాత్రి 9.30 సమయంలో స్నేహితులను కలవడానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కాగా శనివారం ఉదయం అతని వాహనం తుంకుంట సమీపంలోని చెరువు వద్ద గుర్తించిన స్థానికులు పోలిసులకు సమాచారం అందించారు.

Read More మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో అభినందన సభ

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో గాలించగా శివకుమార్ మృతదేహం లభ్యమైంది. కాగా శివకుమార్ బైక్ డ్యామేజ్ కావడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

IMG-20241012-WA4727

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి