ఘనంగా శ్రీ లక్ష్మి నృసింహ కళ్యాణ మహోత్సవం

ఘనంగా శ్రీ లక్ష్మి నృసింహ కళ్యాణ మహోత్సవం

జయభేరి, మేడ్చల్ :
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ గార్డెన్ లో విష్ణు శౌర్య ఆధ్వర్యంలో వేద పండితుల చే  శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవం లో అధిక సంఖ్యలో  దంపతులు సంప్రదయ పద్దతిలో పూజలో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అథితులుగా మాజీ మంత్రి ,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి లు హాజరయ్యారు.అథితులను విష్ణు శౌర్య శాలువలతో సన్మానించారు. శ్రీ విపంచి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో సాంసృతిక మరియు ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.ఈ సందర్భంగా విష్ణు శౌర్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే కల్యాణ మహోత్సవానికి విచేస్తున్న భక్తులందరికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామి వారి ఆశీస్సులు ఉండాలన్నారు.

Views: 0