నేడు శామీర్ పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం - ఏ ఈ రమేష్

వినియోగదారులందరూ సహకరించాలని విజ్ఞప్తి

నేడు శామీర్ పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం - ఏ ఈ రమేష్

జయభేరి, మే 26:

శామీర్ పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఈ నెల 27న పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శామీర్ పేట్ విద్యుత్  ఏఈ రమేష్ తెలిపారు. శామీర్ పేట్ సెక్షన్ పరిధిలోని శామీర్ పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నల్సార్  మరియు ఎన్టీఆర్ ఓ  పీడర్ పరిధిలో మరమ్మత్తులు కారణంగా పెద్దమ్మ కాలనీలో సెలబ్రిటీ హోమ్స్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.

Read More Telangana I తుంగతుర్తి గడ్డపై ఎగరబోయే జెండా..!?

అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తూముకుంట  పీడర్ పరిధిలో మరమ్మత్తులు చేపడుతున్నందున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 ఐదు గంటల వరకు శామీర్ పేట్ గ్రామానికి విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ తెలిపారు. ఈ అంతరాయాన్ని దృష్టి లో పెట్టుకుని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని  ఏఈ కోరారు.

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

Views: 0