ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ పిలుపు

ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి

జయభేరి, కొండమల్లేపల్లి :
కొండమల్లేపల్లి లో బీసీ సంక్షేమ సంఘం సమావేశం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈనెల 25 సోమవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపుమేరకు  బీసీల సమయభేరిని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఈ సమరభేరిని విజయవంతం చేయాలని మండల కేంద్రంలో పోస్టర్, పాంప్లెట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగ 75కోట్ల ఉన్న బీసీ ప్రజానీకానికి బడ్జెట్ కేంద్రం 2 వేల కోట్లు కేటాయించడం బీసీ ప్రజలను అవమానం చేసినట్టని  ఇప్పటికే కేంద్రంలో  బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు, రాజ్యాంగ చట్టబద్ధత,బీసీలకు విద్య ఉద్యోగ రిజర్వేషన్లు జనాభా ప్రకారం 27 నుంచి 56% పెంచాలి.  చట్టసభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.  అనే డిమాండ్లతో అందరూ తమ విధిగా భావించి సభను విజయవంతం చేయగలరు.

Read More ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు

ఈ కార్యక్రమంలో ఏరుకొండ రాము,  ఎస్ వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు అబ్బనబోయిన  శ్రీనివాస్ యాదవ్,  గుండెబోయిన లింగం యాదవ్,   గిరి వెంకటయ్య గౌడ్,నాయకులు బొడ్డుపల్లి శంకర్,  జట్ట మోని యాదయ్య, మేడిపల్లి జంగయ్య, తోటపల్లి శీను, సల్లోజు శ్రీనివాసచారి, మట్టిపల్లి యాదయ్య యాదవ్,మావిళ్ళ శేఖర్ యాదవ్, సొనగంటి గోవర్ధనా చారి,కలగోని రమేష్ గౌడ్,పులిజాల గోవర్ధన్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు..