కేయూ ఇన్చార్జి వీసీ ని కలిసిన ఆకుట్

ఏ.ఆర్ అశోక్ బాబు ను ఆ స్థానం నుండి తొలగించాలని డిమాండ్

కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ వాకాటి కరుణను సెక్రటేరియట్, హైద్రాబాద్ లో అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్శిటీ టీచర్స్ జనరల్ సెక్రటరీ డా మామిడాల ఇస్తారి వినతి

కేయూ ఇన్చార్జి వీసీ ని కలిసిన ఆకుట్

జయభేరి, బ్యూరో చీఫ్ వరంగల్ మే 22 :
వాకాటి కరుణ కేయూ లో వున్న సమస్యల గురుంచి ఆకుట్ సభ్యులను అడిగి తెలుసుకొన్నారు.

ఈ సంద ర్భంగా ఆకుట్ సభ్యులు మాట్లాడుతూ... ఒక మంచి అకడమీశీయన్ కేయూ కు వీసీగా రాకపోవడం వల్లనే కేయూలో అనేక సమస్యలు తలెత్తాయని, ముఖ్యంగా కేయూ భూములను కబ్జా చేసిన వారిని అసిస్టెంట్ రిజి స్ట్రార్ గా పెట్టుకొని, రిటైర్ అయిన రిజిస్ట్రార్ ను యూ నివర్సిటీ చట్టానికి విరుద్ధంగా నియామకం చేసుకొని మాజీ వీసీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, విజిలె న్స్ విచారణకు అదేశించాక వీసీ లాడ్జి నుండి ఫైళ్లు మాయం చేశారని వాకాటి కరుణతో వివరించామని తెలిపారు.

Read More మేడ్చల్ లో కీచక పోలీస్

విజిలెన్స్ విచారణలో వున్న అంశాలపై కొందరు టీచర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు మిగితా కొందరు టీచర్లను తప్పు దోవ పట్టిస్తున్నారని తెలిపా రు. ఇటీవల అక్రమంగా నియమించిన పాలన పదవు లను, టీచర్ల బదిలీలను రద్దు చేయాలని, మంచి అకా డేమిక్ వాతావరణం కేయూలో నెలకొల్పడానికి ఆకుట్ సహకరిస్తుందని చెప్పామని అన్నారు. ల్యాండ్ కమిటీ నుండి తొలగింపబడి భూకబ్జా దారుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబు ను ఆ స్తానం నుండి తొలగించాలని తెలిపామని అన్నారు.

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు

అకాడమిక్ విషయాలలో వున్న సమస్యల ను తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సమస్యలన్నిం టినీ ప్రాధాన్యత క్రమంలో అకుట్ ద్వారా తెలియచేస్తే అన్నిటినీ పరిష్కరిస్తానని తెలిపారని అన్నారు. ఇన్చా ర్జి వైస్ చాన్సలర్ వాకాటి కరుణను కలిసిన వారిలో ఆకుట్ అధ్యక్షులు ప్రో. టీ. శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ డా మామిడాల ఇస్తారి, ఉపాధ్యక్షులు ప్రో. జీ. బ్రహ్మేశ్వ రి, జాయింట్ సెక్రటరీ డా. కే కిషోర్ కుమార్, ఈసీ మెంబర్లు డా.డీ. రమేష్, డా ఎన్. సుదర్శన్ లు వున్నారు.

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.