Kamareddy I కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఘనంగా సన్మానం
మండల అధ్యక్షులుగా రెండవ సారి నియామకం
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో :
రాజంపేట మండలం రెండు నియోజక వర్గాల పరిధిలో ఉండడంతో సమాచార లోపం ఇబ్బందుల్లో వుందని, త్వరలోనే వాటిని సరి చేసుకుంటామని నూతన అధ్యక్షులు సావుసాని యాదవ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం భవనంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు రాజంపేట గ్రామ అధ్యక్షులు బెస్త చంద్రం,మ్యాకల నర్సింలు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ తనకు రెండవసారి మండల అధ్యక్షునిగా అధికారం కట్టబెట్టినందుకు రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కార్ ను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరన్న పటేల్, యువజన నాయకులు అంకం కృష్ణారావు,కిసాన్ సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు బెస్త చంద్రం, మేకల నరసింహులు, తోడంగల సత్యనారాయణ, భాగయ్య, భీమయ్య, మైనార్టీ అధ్యక్షులు షాదుల్లా, షాదుల్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post Comment