కాళేశ్వరం.. విచారణ ముమ్మరం
విజిలెన్స్, సాండ్ రిపోర్టులపై పీసీ ఘోష్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గురువారం బీఆర్కే భవన్‌లో ఇరిగేషన్ అధికారులు, ఈఎన్సీలు నాగేందర్, అనిల్ కుమార్‌లతో భేటీ అయ్యారు. దర్యాప్తును ముమ్మరం చేసి జూన్ 30వ తేదీలోగా రిపోర్టును ప్రభుత్వానికి అందించాలని కమిషన్ భావిస్తున్నది. పీసీ ఘోష్ కమిషన్ విజ్ఞప్తి మేరకు ఎన్‌డీఎస్ఏ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించింది.
జయభేరి, హైదరాబాద్, మే 11 :
ళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్ల కుంగుబాటు, నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ సారథ్యంలో ఎంక్వైరీ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇటీవలే బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించింది. బ్యారేజీలను పరిశీలించి సాంకేతిక అంశాలనూ సేకరించింది. ఎన్‌డీఎస్ఏ మధ్యంతర నివేదికతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలో తెలుసుకున్న అంశాలు, ప్రజాభిప్రాయ సేకరణలో తమ దృష్టికి వచ్చిన విషయాలు, కాగ్, విజిలెన్స్, సాండ్ రిపోర్టులపై పీసీ ఘోష్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గురువారం బీఆర్కే భవన్‌లో ఇరిగేషన్ అధికారులు, ఈఎన్సీలు నాగేందర్, అనిల్ కుమార్‌లతో భేటీ అయ్యారు. దర్యాప్తును ముమ్మరం చేసి జూన్ 30వ తేదీలోగా రిపోర్టును ప్రభుత్వానికి అందించాలని కమిషన్ భావిస్తున్నది. పీసీ ఘోష్ కమిషన్ విజ్ఞప్తి మేరకు ఎన్‌డీఎస్ఏ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందన్న ఆరోపణలు రావడంతో దానిపైనా కమిషన్ ఎంక్వైరీ చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు టెండర్ మొదలై 2019 జూన్ పూర్తయ్యే నాటికి జరిగిన పరిణామాలను పరిశీలించి అవసరమైన వారిని పిలిచి పీసీ ఘోష్ కమిషన్ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 32 డిపార్ట్‌మెంట్లు, పలు ఏజెన్సీలు ఉన్నాయి. వీటితోపాటు గత ప్రభుత్వంలోని పెద్దలను కూడా పిలిచి విచారించే చాన్స్ ఉన్నది.
Post Comment