కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పోరేటర్ పోగుల నర్సింహ్మరెడ్డి ఆధ్వర్యంలో చేరిక...
బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ దొంతరబోయిన మహేశ్వరి, మేడ్చల్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దొంతరబోయిన కృపాసాగర్ కాంగ్రెస్ లో చేరిక.. కండువా కప్పి ఆహ్వానించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర తోటకూర వజ్రేష్ యాదవ్
జయభేరి, మేడిపల్లి :
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి, మేడ్చల్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దొంతరబోయిన కృపాసాగర్ బిఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని రాజీనామా చేసి బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిపిసిసి ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, తోటకూర అజయ్ యాదవ్, సుమన్ నాయక్ పాల్గొన్నారు
Post Comment