అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బౌరంపెట్ సర్వే నం.188,187,189లో గల 2ఎకరాల 32 గుంటల స్థలం విషయంలో కృష్ణా రెడ్డి, కంసమ్మా అనే రైతులకు త్రిపుర భవన నిర్మాణ సంస్థ కు మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
జయభేరి, కుత్బుల్లాపూర్ :
భౌరం పెట్ లో వ్యవసాయ భూమిని అమ్మనందుకు కిరాయి గుండాలతో తమ పై దాడి కి యత్నిస్తున్నారని రెండు రోజుల క్రితం దుండిగల్ పోలీస్ స్టేషన్ వెళ్లిన రైతుల ఘటన మరవకముందే, రైతులకు మరో సమస్య వచ్చి పడింది.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బౌరంపెట్ సర్వే నం.188, 187, 189లో గల 2ఎకరాల 32 గుంటల స్థలం విషయంలో కృష్ణా రెడ్డి, కంసమ్మా అనే రైతులకు త్రిపుర భవన నిర్మాణ సంస్థ కు మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వ్యవసాయ భూమిలోకి వచ్చి పంట నాశనం చేయడమే కాకుండా ఎదురు తిరిగిన వాళ్లపై అక్రమ కేసులు పెట్టీ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల భార్యాపిల్లలు.
తరతరాలు గా తాతల నుండి సంక్రమించిన తమ భూమి పై బి అర్ గల్లి లీడర్లు కన్నేసి, త్రిపుర ల్యాండ్ మార్క్ సంస్థ తో కలిసి వేధిస్తున్నారని... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల విషయంలో చొరవ చూపి ఇలాంటి గుండాలపై కఠిన చర్యలు తీసుకుని తమ కు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. త్రిపుర భవన నిర్మాణ సంస్థ తో కల్సి మేకల వెంకటేష్, పసుపులేటి సుధాకర్ అనే బి అర్ ఎస్ నాయకులు తమ పై వొత్తిడి తెస్తున్నానరని వారి చెర నుండి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
Post Comment