టీపీఎస్సీ రూల్స్ ప్రకారం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలి
ఈ నెల 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో 21 కేంద్రాలలో జరగనుందని ఈ పరీక్షలో 8223 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని అన్నారు. పరీక్ష నిర్వహణకు ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ను నిర్వహించడం జరిగిందని ప్రతి పరీక్ష కేంద్రంలో టీజీపీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థుల సౌకర్యం త్రాగునీరు, మరుగుదొడ్డి, ఫర్నిచర్, విద్యుత్ దరితర సౌకర్యాలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
జయభేరి, సిద్దిపేట :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు.
అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష హాల్లోకి తీసుకురాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. హాల్ టికెట్ పై ఫోటో లేకపోయినా, పేరు తప్పు పడిన అభ్యర్థుల నుండి అఫిడవిట్ ని తీసుకోవాలని అన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లో వారి వివరాలను సరిగా రాశారో లేదో ఇన్విజిలేటర్ల ద్వారా చెక్ చేయించాలని అన్నారు. అంద దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు సహాయకులుగా ఇంటర్మీడియట్ లేదా ఆ లోపు చదివిన వారికి మాత్రమే అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగ్రవాల్, ఇందూరు కళాశాల ప్రిన్సిపాల్ విపి రాజు, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు.
Post Comment