పర్యావరణ పరిరక్షణకు అందరూ దోహద పడాలి

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీటీసీ నాగరాజు

పర్యావరణ పరిరక్షణకు అందరూ దోహద పడాలి

జయభేరి, జూన్ 5:

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా మూడుచింతల పల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏంపిటిసి నాగరాజు పాల్గొని మొక్కలు నాటారు.

Read More నవవధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన గోలి సంతోష్

IMG_20240605_202817

Read More దేవరకొండ పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక 

అనంతరం వారు మాట్లాడుతూ... రోజూ రోజుకు అడవులు అంతరించిపొతుండడం వల్ల పర్యావరణంలో పెను మార్పులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కార మార్గం మొక్కలు నాటడమే అన్నారు. ప్రతీ ఒక్కరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాని పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఇదే విధంగా ఉంటే మున్ముందు మానవ మనుగడే ప్రశ్నార్థమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శోభారాణి, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్, మాజీ వార్డు సభ్యులు వనిత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ