అలా చేయండి... కొత్త కేంద్రమంత్రులకు రేవంత్ సూచన

తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు చెప్పారు.

అలా చేయండి... కొత్త కేంద్రమంత్రులకు రేవంత్ సూచన

జయభేరి, హైదరాబాద్, జూన్ 10 :
కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో  శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని కోరారు. 

తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు చెప్పారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నానన్నారు.  విభజన చట్టంలో అనేక అంశాలకు జూన్ రెండో తేదీన ముగింపు లభించింది. ఉమ్మడి రాజదాని ప్రస్తావనకు కూడా కాలం తీరింది. 

Read More శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

అయితే పదేళ్లలోపు రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలన్నీ పరిష్కారం కావాలని లేకపోతే కేంద్రం పరిష్కారం చూపుతుందని చట్టంలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోలేకపోయాయి.  2014 నుంచి 2019d  వరకు అప్పట్లో ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాలు అనేక సార్లు చర్చలు జరిపాయి. అయితే  ఏ ఒక్క అంశంలోనూ పూర్తి పరిష్కారం లభించలేదు. ఇప్పుడు చాలా అంశాలకు కేంద్ర ప్రభుత్వమే పరిష్కారం చూపించాల్సి ఉంది. నిజానికి ఉమ్మడి సంస్థలను విభజించుకుని నిర్వహించుకుంటున్నారు. 

Read More వ్యవసాయ సహకార సంఘం 43 వ సాధారణ సమావేశం

కానీ వాటి ఉమ్మడి ఆస్తులపైనే వివాదం ఉంది. ఆర్టీసీని ఎప్పుడో విభజించినా.. వాటి ఆస్తులపై ఇంకా వివాదం ఉంది. ఉమ్మడి ఆస్తులు ఎక్కడివి అక్కడే అన్న పద్దతిలో అని తెలంగాణ భావిస్తోంది. కానీ రాజధాని కాబట్టి అన్ని హైదరాబాద్ లో ఉంటాయని.. జనాభా ప్రాతిపదికన విభజించాల్సిందేనని ఏపీ ్దఅంటోంది. వీటికి పరిష్కారం లభించాల్సి ఉంది. ఇది కీలకమన సమయం కాబట్టి కేంద్ర మంత్రుల సహకారం అవసరం కాబట్టి.. రేవంత్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.  

Read More మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు