CM Revanth Reddy : సీఎం సభను విజయవంతం చేయాలి - అలియబాద్ మాజీ సర్పంచ్ కంఠం కృష్ణా రెడ్డి

నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కావాలి

  • అంతాయిపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో నిర్వహించే  సభను విజయవంతం చేయాలని అలియబాద్ మాజీ సర్పంచ్ కంఠం కృష్ణా రెడ్డి కోరారు.

CM Revanth Reddy : సీఎం సభను విజయవంతం చేయాలి - అలియబాద్ మాజీ సర్పంచ్ కంఠం కృష్ణా రెడ్డి

జయభేరి, ఏప్రిల్ 21 :
ఈ నెల 22న మేడ్చల్ జిల్లా అంతాయిపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో నిర్వహించే  సభను విజయవంతం చేయాలని అలియబాద్ మాజీ సర్పంచ్ కంఠం కృష్ణా రెడ్డి కోరారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని, ఈ సందర్భంగా దొంగల మైసమ్మ నుండి అంతాయిపల్లి సభ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Views: 0

Related Posts