Bharat Rice : సిటీలో భారత్ రైస్ విక్రయాలు..

కేవలం రూ. 29కి చిన్న బియ్యం ఇస్తామని చెప్పి 50 రోజులు కావస్తున్నా ఇంత వరకు కేంద్రం నుంచి బియ్యం రాలేదు.

Bharat Rice : సిటీలో భారత్ రైస్ విక్రయాలు..

జయభేరి, హైదరాబాద్, ఏప్రిల్ 16 :
ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధర రోజురోజుకూ పెరుగుతోంది. అయితే దేశవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి పెరిగినప్పటికీ బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకోసం పేద ప్రజలకు భారత్ రైస్ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం రూ. 29కి చిన్న బియ్యం ఇస్తామని చెప్పి 50 రోజులు కావస్తున్నా ఇంత వరకు కేంద్రం నుంచి బియ్యం రాలేదు. అయితే అతి తక్కువ ధరకు సబ్సిడీ బియ్యం కోసం సామాన్యులు, పేదలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ రైస్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ భారత్ రైస్ ఇటీవల మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ బియ్యం విక్రయాలను కొన్ని ప్రైవేట్ కంపెనీలు, వ్యాపారులు ప్రారంభిస్తున్నారు. ఇంతకీ ఈ భారత్ రైస్ హైదరాబాద్‌లో ఎక్కడ విక్రయిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారత్ బియ్యం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈ బియ్యం విక్రయాలను కొన్ని ప్రైవేటు సంస్థలు, వ్యాపారులు ప్రారంభిస్తున్నారు. ఇంతలో, ఈ బియ్యాన్ని విక్రయించే బాధ్యతలను నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF), కేంద్రీయ భండార్ వంటి సంస్థలకు అప్పగించారు. ప్రస్తుతం నాఫెడ్ గ్రేటర్ పరిధిలోని 24 కేంద్రాల్లో భారత్ రైస్ విక్రయిస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి ఈ విక్రయాలు ప్రారంభమైనట్లు నాఫెడ్ అధికారులు తెలిపారు.

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

bharat-rice1-1708932274

Read More క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...

అలాగే తెలంగాణలో 5 వేల క్వింటాళ్ల వరకు బియ్యాన్ని విక్రయించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కానీ, ఎలాంటి ప్రచారం లేకపోవడంతో భారత్ బియ్యం అమ్మకాలు ఊపందుకోలేదు. ఈ బియ్యం మొదటి రకంగా ఉంటుందని చాలా మంది భావించారని, వండిన తర్వాత బియ్యం కాస్త ముద్దగా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. అన్నం టేస్టీగా ఉన్నా.. పలుచగా లేకపోవడంతో చాలామంది ఈ అన్నంపై ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో తనకు తెలిసిన ఓ వ్యాపారికి పది కేజీల బస్తాలను విక్రయించినట్లు తెలిపాడు. కానీ 10 కేజీల బస్తాలను 40 వరకు విక్రయించేందుకు ప్రయత్నించారని.. ఇదిలా ఉండగా రెండోసారి ఎవరూ తీసుకోలేదని తెలిపారు. అలాగే కాచిగూడకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యాపారి 15 రోజులుగా విక్రయిస్తున్నామని, ముందుగా వినియోగదారులకు నమూనాలు చూపి బియ్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. మొదట 10కిలోల 200 బస్తాలు తీసుకొచ్చి పూర్తిగా విక్రయించామని, రెండోసారి 100 తీసుకొచ్చామని.. అలాగే ఈ భారత్ రైస్ నగరంలోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

Read More మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు ఘన సన్మానం 

పంపిణీ కేంద్రాలు...
ఏపీ రైస్‌ స్టోర్స్‌, మెట్టుగూడ
చంద్రమౌళి ట్రేడర్స్, కార్వాన్
ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్, SR నగర్
డింగ్‌డాంగ్ సూపర్ మార్కెట్
గౌతమ్‌రైస్ డిపో, కాప్రా
జై తుల్జాభవాని ఏజెన్సీ, లంగర్‌హౌస్
మాణిక్య ట్రేడర్స్, ఆర్కే పురం
మురళి కిరణ్ మరియు జనరల్ స్టోర్స్, పటాన్చెరువు
ముత్తయ్య గ్రాండ్ బజార్, సెరిలింగంపల్లి
ఖైసర్ కిరాణా, జనరల్ స్టోర్, హైదరాబాద్
సాయిదీప్ సూపర్ స్టోర్స్, మెదక్
సిర్వి ట్రేడర్స్, బోడుప్పల్
శంకర్ ట్రేడింగ్ కంపెనీ, సికింద్రాబాద్
శ్రీ గోవింద ట్రేడర్స్, కాచిగూడ
శ్రీ వీరభద్ర ట్రేడర్స్, కవాడ్‌గూడ
శ్రీ అంబా ట్రేడర్స్, హైదరాబాద్
శ్రీ బాలాజీ రైస్ డిపో, రాంనగర్
శ్రీ సాయిబాబా రైస్ డిపో, కార్వాన్
సాయిశివ రైస్ ట్రేడర్స్, కర్మన్‌ఘాట్
శ్రీ సాయి ట్రేడర్స్, కొత్తపేట
శ్రీ ట్రేడర్స్, చందానగర్
ఉజ్వల్ ట్రేడర్స్, మల్లేపల్లి
ఉప్పు రాజయ్య ట్రేడర్స్, షాపూర్నగర్
రిలయన్స్, దేవరాయంజల్

Read More వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి